పార్కుకు వెళితే వజ్రం దొరికింది..

Thu,August 22, 2019 09:49 PM

park visitor finds 3.72 carat yellow diamond in america

డైమండ్ పార్కుకు వెళ్తే నిజంగానే వజ్రం దొరికితే ఎలా ఉంటుంది. వినడానికి బాగున్నా ఇలాంటి ఘటనలు చాలా అరుదు. అమెరికాలోని డైమండ్స్ స్టేట్ పార్కులో ఓ సందర్శకురాలికి వజ్రం దొరికింది. మిరండా హొల్లింగ్ హెడ్ (27)తన కుటుంబంతో కలిసి అర్కాన్సస్ లోని డైమండ్స్ స్టేట్ పార్కుకు వెళ్లింది. మిరండా పార్కులో ఈశాన్యంలో ఉన్న కొండప్రాంతంలో కూర్చొని.. వజ్రాలను గుర్తించడమెలా అనే వీడియోను యూట్యూబ్ లో చూస్తూ ముందుకు చూసింది. అక్కడే మెరిసే రత్నం కనిపించింది. ఇంకేముంది..తీరా చూస్తే అది 3.72 క్యారెట్ల డైమండ్.

ఏకంగా వజ్రం దొరకడంతో మిరండా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వజ్రాలను కనుగొనడం ఎలా అని యూట్యూబ్ లో చూస్తున్న సమయంలో ఇలా వజ్రం దొరకడంతో నేను భావోద్వేగానికి లోనయ్యానని మిరండా చెప్పింది. ఈ వజ్రాన్ని జ్ఞాపకంగా ఉంచుకోవాలా..లేకపోతే అమ్మేయాలా..? లేదంటే ఉంగరం చేయించుకోవాలా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని మిరండా చెప్పింది. మిరండాకు వజ్రం దొరకడంతో మీది ఎంత అదృష్టమో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 2017 మార్చి నుంచి పార్కు సందర్శకులకు దొరికిన పెద్ద డైమండ్ ఇదేనని, 2013 అక్టోబర్ నుంచి దొరికిన పచ్చ వజ్రాల్లో కూడా ఇదే అతిపెద్దదని పార్కు అధికారులు తెలిపారు.

3419
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles