విమానంలో తేలు.. బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు..వీడియో

Mon,February 18, 2019 07:49 PM

Passenger spots scorpion crawling out of luggage compartment on plane

విమానంలో పాములను చూసుంటారు కదా. అది పాతదైంది. ఇప్పుడు నయా ట్రెండ్. విమానంలో తేళ్లు కూడా ప్రయాణిస్తున్నాయి. దానికి నిదర్శనమే ఈ ఘటన. ఇండోనేషియాలోని రియాయులో ఉన్న సుల్తాన్ సియారిఫ్ కాసిమ్ 2 ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బాంటెన్‌లోని టాంగెరంగ్‌లో ఉన్న సొయికర్నో హట్టా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు లయన్ ఎయిర్ విమానం ఫిబ్రవరి 14న బయలు దేరింది. ఆ విమానంలోనే తేలు ప్రత్యక్షమైంది. సీటు మీద ఉండే లగేజ్ కంపార్ట్‌మెంట్‌లో ఓ ప్రయాణికుడు తేలును గమనించాడు.

దాన్ని చూసి భయపడి పోయాడు. మిగితా ప్రయాణికులు కూడా ఆ తేలును చూసి భయపడ్డారు. అది చిన్న తేలు అయితే ఎవరూ అంతలా భయపడేవాళ్లు కాదేమో. అది పెద్దగా ఉండటంతో అది ఎక్కడ తమ మీద పడుతుందోనని వణికిపోయారు. దాన్ని ఫోటోలు, వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు ఓ ప్యాసెంజర్.


దీనిపై స్పందించిన లయన్ ఎయిర్ సంస్థ.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలను బట్టి చూస్తే అది స్పైడ‌ర్‌లా కనిపిస్తోంది. విమానం ల్యాండ్ అయిన తర్వాత... ప్యాసెంజర్లు దిగిన తర్వాత.. లగేజీ విమానం నుంచి దింపిన తర్వాత.. విమానం మొత్తం చెక్ చేయించాం. కానీ.. వీడియోలో చూపించినటువంటిదేమీ కనిపించలేదు.. అంటూ సంస్థ ప్రకటించింది.

5965
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles