నడిరోడ్డుపై విమానం క్రాష్.. జస్ట్‌లో తప్పించుకున్న కారు.. వీడియో

Thu,March 14, 2019 05:50 PM

plane crashes on road luckily it misses traffic before crash

కెనడాలోని మార్ఖమ్‌లో జరిగిన ప్రమాదం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. జెట్ విమానం ఒకటి బట్టన్‌విల్లే ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అవుతుండగా పైకి ఎగరలేక కంట్రోల్ తప్పింది. దీంతో ఆ విమానం నడి రోడ్డు మీద క్రాష్ అయింది. అయితే.. ఆ రోడ్డు ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. విమానం క్రాష్ అయ్యేటప్పుడు మాత్రం ఏ వాహనం రాలేదు. ఒక్క క్షణం ఆలస్యంగా ఓ కారు వచ్చింది. అప్పటికే కారు బ్యానెట్‌ను రాసుకుంటూ వెళ్లింది విమానం. ఈ ఘటన కారులోని కెమెరాలో రికార్డయింది.

చెప్పుకోవడానికి ఇది పెద్ద ప్రమాదమే. కానీ.. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు. విమానంలోని ఇద్దరు వ్యక్తులు కూడా ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. కారులోని వ్యక్తులకు కూడా ఏం కాలేదు. అయితే.. కారు ఒక్క క్షణం ముందు వెళ్లినా.. విమానం క్రాష్ అవడం ఒక్క క్షణం ఆలస్యమైనా.. కారు మాత్రం తుక్కుతుక్కు అయ్యేదని స్థానికులు చెబుతున్నారు. ఇక.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

4550
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles