కాన్సులేట్ ఏర్పాటు చేసిన తొలి దేశం భారత్: ప్రధాని మోదీ

Thu,September 5, 2019 05:39 PM

PM Modi addresses at the Plenary Session of 5th Eastern Economic Forum


వ్లాదివోస్టోక్‌‌: తూర్పు ఆసియా, భారత్‌ ల మధ్య సంబంధాలు కొత్తవి కావని, పురాతనకాలం నుంచి కొనసాగుతున్నవని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వ్లాదివోస్టోక్‌లో జరుగుతున్న 5వ తూర్పు ఎకనమిక్ ఫోరం ప్లీనరీ సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యారు.

ప్లీనరీలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ..వ్లాదివోస్టోక్‌‌ లో కాన్సులేట్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి దేశం భారత్‌ అని ప్రధాని అన్నారు. సోవియట్‌ రష్యా విదేశీయుల రాకపై పరిమితులు విధించిన సమయంలో కూడా వ్లాదివోస్టోక్‌ భారతీయుల కోసం తమ ద్వారాలను తెరిచి ఉంచిందని మోదీ తెలిపారు. భారత్‌లో సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ నినాదంతో నవభారత నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని ప్రధాని వెల్లడించారు. 2024 సంవత్సరం నాటికి భారత్‌ను 5 ట్రిలియన్‌ యూఎస్‌ డాలర్ల ఎకానమీ వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. తూర్పు ఆసియా ‘యాక్ట్‌ ఈస్ట్‌’ విధానంలో భారత్‌ కూడా భాగస్వామ్యమైందని చెపారు. తూర్పు ఆసియా అభివృద్ధి కోసం భారత్‌ 1 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు అందజేయనున్నట్లు చెప్పారు.

రష్యా పర్యటనలో భాగంగా అంతకుముందు ప్రధాని మోదీ ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జపాన్ ప్రధాని షింజో అబే, మలేషియా ప్రధాని మహతిర్ మహ్మద్, మంగోలియా అధ్యక్షుడు ఖల్ట్ మాగిన్ బట్టుల్గాతో సమావేశమయ్యారు.

1735
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles