ఈ నెల 27 వరకు అమెరికాలో పర్యటించనున్న మోదీ

Sat,September 21, 2019 07:46 AM

హైదరాబాద్: భారత ప్రధాని మోదీ ఈ నెల 27వ తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు. హ్యూస్టన్, న్యూయార్క్ నగరాల్లో మోదీ పర్యటన ఉంటుంది. హ్యూస్టన్‌లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయులతో సమవేశం ఉంటుంది. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ నేతలతో కలిసి ప్రసంగిస్తారు. ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న వాతావరణ సదస్సులో మోదీ మాట్లాడుతారు. ఇదే సదస్సులో ఉగ్రవాదం, ఆరోగ్యం అంశాలపై ప్రసంగిస్తారు. ఈనెల 24న ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటేరస్ ఇచ్చే విందుకు హాజరవుతారు. మహాత్మాగాంధీ 150 జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి బృందంతో కలిసి 150 మొక్కలు నాటనున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులతో మోదీ చర్చలు జరపనున్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో ప్రసంగించనున్నారు.

452
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles