కుక్కల దాడిలో గర్భిణి మృతి

Wed,November 20, 2019 07:50 AM

ఫ్రాన్స్: కుక్కలు జరిపిన దాడిలో ఓ గర్భిణి(29) మృతిచెందింది. ఈ విషాద సంఘటన ఫ్రాన్స్‌లోని విల్లర్స్-కాటెరెట్స్ పట్టణానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో మంగళవారం నాడు చోటుచేసుకుంది. ఈ నగరం ప్యారిస్‌కు ఈశాన్యంగా 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహిళ తన పెంపుడు కుక్కతో అటవీ ప్రాంతంలో నడకకు వెళ్లింది. కాగా ఒక్కసారిగా ఇతర కుక్కలు వచ్చి ఆమెపై దాడికి పాల్పడ్డాయి. ఆ సమయంలో ఆమె తన సహచరిని పిలిచింది. అతను వచ్చేసరికి మహిళ కాళ్లు, చేతులు, తలపై కుక్కలు దారుణంగా కరవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిగా కుక్కల దాడి ఘటన నిర్ధారణ అయింది. దీంతో 90 కుక్కలను విచారణ అధికారులు ఇప్పటికే పరిశీలించారు. వీటిలో సదరు మహిళకు చెందిన ఐదు కుక్కలు సైతం ఉన్నాయి. జింకల వేట కోసం వచ్చిన కుక్కలు మహిళపై దాడి చేసి చంపినట్లుగా అధికారులు భావిస్తున్నారు.

1197
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles