ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోదీ ప్రసంగం

Fri,September 27, 2019 07:52 PM

అమెరికా: న్యూయార్క్‌లో గల ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తున్నారు. ప్రధాని అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. యూఎన్‌ఓ జనరల్ అసెంబ్లీని ఉద్దేశిస్తూ ప్రధాని ప్రసంగిస్తూ.. ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం తనను, తన ప్రభుత్వాన్ని మరో మారు ఎన్నుకుందన్నారు. అతిపెద్ద మెజార్టీతో గెలుపొంది అధికారంలోకి వచ్చామన్నారు. 130 కోట్ల మంది భారతీయుల తరపున తాను మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది గాంధీ 150వ జయంతి జరుపుకుంటున్నాం. గాంధీ మార్గం నేటికి అనుసరణీయమని పేర్కొన్నారు.

2580
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles