ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకం కావాలి: మోదీ

Fri,September 27, 2019 10:26 PM

హైదరాబాద్: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకం కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని శుక్రవారం యూఎన్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం తనను, తన ప్రభుత్వాన్ని మరో మారు ఎన్నుకుందన్నారు. అతిపెద్ద మెజార్టీతో గెలుపొంది అధికారంలోకి వచ్చామన్నారు. 130 కోట్ల మంది భారతీయుల తరపున తాను మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది గాంధీ 150వ జయంతి జరుపుకుంటున్నాం. సత్యం, అహింస మహాత్మాగాంధీ బోధించిన సిద్ధాంతాలు. అటువంటి గాంధీ మార్గం నేటికి అనుసరణీయమన్నారు. నరుడిలో ఈశ్వరుణ్ని చూడటమే భారతీయత అన్నారు. వివేకానందుడు చెప్పినట్లు శాంతి, సామరస్యమే ఇప్పటికీ ప్రపంచానికి ఆదర్శమన్నారు. దేశాభివృద్ధి అంటే మానవాభివృద్ధేనన్నారు. 130 కోట్ల భారతీయులను దృష్టిలో పెట్టుకుని పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. 2022 నాటికి పేదలకు మరో రెండు కోట్ల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. తమ ప్రయత్నాలు మొత్తం ప్రపంచ శ్రేయస్సుకు ఉపయోగపడాలన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ ఆదర్శమన్నారు. గ్లోబల్ వార్మింగ్‌కు భారత్ పెద్ద కారణం కాదని తెలిపిన ప్రధాని వాతావరణ సమస్యల పరిష్కారానికి మాత్రం భారత్ తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. ఐక్యరాజ్యసమితి మరింత శక్తివంతం కావాలన్నారు.
అక్టోబర్ 2 నుంచి సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ నిషేధం..
హైదరాబాద్: అక్టోబర్ 2వ తేదీ నుంచి దేశంలో సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఒక అభివృద్ధి చెందుతున్న దేశం ఐదేళ్లలో రూ.11 కోట్ల శౌచాలయాలు నిర్మించినట్లు చెప్పారు. ఇది ప్రపంచానికి కొత్త సందేశమన్నారు. భారత్‌లో పేదలకు రూ. 5 లక్షల విలువైన ఆరోగ్యబీమా కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తూ.. 2025 నాటికి దేశం నుంచి టీబీని పూర్తిగా పారద్రోలనున్నట్లు తెలిపారు. యూఎన్‌ఓ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఇది ఒకటిగా ఉన్న విషయం తెలిసిందే. డిజిటలీకరణతో అవినీతికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇప్పటికే 20 బిలయన్ డాలర్లు మేర ప్రజాధనం ఆదా అయిందన్నారు. అక్టోబర్ 2 నుంచి దేశంలో సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. 15 కోట్ల కుటుంబాలకు రక్షిత మంచినీరు అందించనున్నట్లు పేర్కొన్నారు.

1644
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles