పసుపుబోర్డును త్వరితగతిన ఏర్పాటు చేయండి..

Sat,November 9, 2019 03:13 PM

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసిన టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని ఆస్ట్రేలియా విభాగం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన నిజామాబాద్‌లో పసుపుబోర్డును త్వరగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. టెర్రరిజంపై మెల్‌బోర్న్‌లో జరిగిన ప్రపంచ సదస్సులో భారత్ నుంచి ప్రాతినిథ్యం వహించడానికి వచ్చిన మంత్రిని సదస్సు అనంతరం వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు నిజామాబాద్ పసుపుబోర్డు అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం, విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను నెరవేర్చేదిశగా ఓ తెలంగాణ బిడ్డగా పోరాడాలని వారు విన్నవించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిగా ఎన్నికైన కిషన్‌రెడ్డికి వారు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో నాగేందర్ రెడ్డితో పాటు సాయిరాం ఉప్పు, సాయి యాదవ్, రామకృష్ణ, అరుణ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

840
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles