కెమెరా కంటికి చిక్కిన అరుదైన జీబ్రా..

Thu,September 19, 2019 03:48 PM


కెన్యా: నలుపు, తెలుగు రంగు చారలున్న జీబ్రా (కంచరగాడిద) అందరికీ తెలిసిందే. తాజాగా ఓ అరుదైన జీబ్రా కెమెరా కంటికి చిక్కింది. కెన్యాలోని మాసయ్ మరా నేషనల్ రిజర్వులో డార్క్ కోటెడ్ తెల్ల మచ్చలతో ఉన్న జీబ్రా తిరుగుతుండగా..ప్రముఖ టూరిస్ట్ గైడ్, ఫొటోగ్రాఫర్ ఆంటోనీ టిరా దాన్ని తన కెమెరాలో క్లిక్‌మనించాడు. కొత్త రకమైన జంతువు కనిపించగానే కొంత అయోమయానికి లోనయ్యా. తర్వాత కొద్దిసేపటికి దాన్ని జీబ్రా అని గుర్తించానని ఆంటోనీ టిరా తెలిపారు. ఫొటో గ్రాఫర్ ఆంటోనీ ఆ జీబ్రాకు టిరా అనే పేరు పెట్టాడు.

ఇక అత్యంత అరుదైన ఈ జీబ్రాను మాసయ్ మరా వన్యసంరక్షణ విభాగం తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసింది. కొన్ని జంతువుల్లో ఇలా చారల మధ్య వ్యత్యాసం కనిపించడం జన్యు పరివర్తనలో అత్యంత అరుదైన అంశమని నేషనల్ జియోగ్రఫిక్ విభాగం పేర్కొంది. ఈ ఫొటో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.

3321
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles