పుల్వామా ఉగ్రదాడిపై రష్యా అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి

Fri,February 15, 2019 01:19 PM

Russian President Vladimir Putin respond on Pulwama Terror attack

హైదరాబాద్ : పుల్వామా ఉగ్రదాడిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఉగ్రదాడి ఘటనను పుతిన్ ఖండిస్తూ.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీకి సందేశం పంపారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు పుతిన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదుల క్రూరమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడి చేసిన వారు, చేయించిన వారు కచ్చితంగా ఫలితం అనుభవిస్తారని పుతిన్ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించే విషయంలో భారత్‌తో కలిసి ముందడుగు వేస్తామని, ఈ సమయంలో భారత్‌కు అండగా ఉంటామని రష్యా అధ్యక్షుడు స్పష్టం చేశారు. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి జ‌రిగిన ఘ‌ట‌న‌లో ప్రాణాలు వ‌దిలిన జ‌వాన్ల సంఖ్య 49కి చేరుకున్న‌ది. ఈ విష‌యాన్ని సీఆర్‌పీఎఫ్ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు.

1763
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles