సెప్టిక్ ట్యాంక్ పేలితే భూకంపం వచ్చిందనుకున్నారు.. వీడియో

Fri,April 20, 2018 03:15 PM

అది ఈస్ట్ చైనాలోని లిని సిటి. తేదీ ఏప్రిల్ 17, 2018. కొంతమంది పిల్లలు రోడ్డు పక్కన టపాకులు పేలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే.. చిన్నారులు ఆడుకుంటున్న ప్రాంతానికి దగ్గర్లోనే ఓ చిన్న గుంతలాగా ఉంది. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. కాని.. పిల్లలు క్రాకర్స్ పేలుస్తుండగా ఒక్కసారిగా ఆ గుంతలోపలి నుంచి పెద్ద శబ్దంతో కూడా పేలుడు సంభవించింది. అంతే కాదు.. పేలుడు ధాటికి ఇద్దరు పిల్లలు ఎగిరి పక్కన పడిపోయారు. భారీ శబ్దాన్ని గమనించిన స్థానికులు భూకంపం వచ్చిందేమో అని కంగారు పడ్డారు. కాని.. అక్కడ వచ్చింది భూకంపం కాదు.. ఆ గుంత కింద ఉన్న సెప్టిక్ ట్యాంక్ పేలింది. దాని వల్లనే అంత పెద్ద శబ్దంతో కూడిన పేలుడు సంభవించింది. అయితే.. పిల్లలు అక్కడ క్రాకర్స్ కాలుస్తుండటంతో వాటి ధాటికే సెప్టిక్ ట్యాంక్ పేలి ఉండొచ్చని స్థానికులు అనుమానించారు. ఇక.. ఈ ఘటన పక్కనే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలయింది.

3847
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles