సర్కస్‌ నుంచి తప్పించుకున్న పులి.. వీడియో

Tue,September 10, 2019 01:19 PM

Siberian tiger escapes cage during circus show in China

సర్కస్‌ నుంచి ఓ పులి తప్పించుకుంది.. ఆ తర్వాత అది మృతి చెందింది. ఈ సంఘటన చైనాలోని క్సియాన్‌క్సింగ్‌ సిటీలో ఈ నెల 6వ తేదీన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ స్కూల్‌ టీచర్స్‌, విద్యార్థులు సర్కస్‌కు వచ్చారు. సర్కస్‌లో పులిని ఆడిస్తున్న క్రమంలో అది అక్కడున్న ఇనుప కడ్డీలపైకి ఎక్కి గుహ నుంచి తప్పించుకుంది. దీంతో టీచర్లు, విద్యార్థులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు.. ఆ రోజు రాత్రి పులి ఆచూకీ కోసం గాలించారు.

మొత్తానికి మరుసటి రోజు పులి ఆచూకీని అధికారులు కనుగొన్నారు. ఆ తర్వాత దానికి మత్తు మందు ఇచ్చి జూపార్కుకు తరలిస్తుండగా పులి మృతి చెందింది. అయితే పులి తప్పించుకుని పారిపోతున్న సమయంలో దాన్ని కారు ఢీకొట్టిందని, దీంతో పులి శరీరంలో అవయవాలు దెబ్బతినడంతోనే అది మృతి చెందినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇక సర్కస్‌ నిర్వహించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

1270
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles