ఫ్లోరిడా టు హవాయికి పాము ఫ్రీ ట్రిప్‌..!

Fri,June 14, 2019 02:51 PM


ఓ పాము ఫ్రీ ట్రిప్‌ను వేసింది. పాము ఏంటీ ఫ్రీ ట్రిప్ ఏంటీ అనుకుంటున్నారా..? అవును మీరు విన్నది నిజమే. ఓ పాము పిల్ల ప్రయాణికుడి బ్యాగులోకి దూరింది. సదరు వ్యక్తి ఫ్లోరిడా నుంచి హవాయికి వచ్చాడు. అయితే ఇంత దూరం ప్రయాణించిన ఆ వ్యక్తికి మాత్రం బ్యాగులో పాము ఉన్నట్లు తెలియదు. ఆ వ్యక్తి మౌవిలోని తన అద్దె ఇంటికి వచ్చాడు. ఇంటి యజమాని ఆ వ్యక్తి బ్యాగులో పాము ఉన్నట్లు గుర్తించి జంతుసంరక్షణ విభాగం అధికారులకు సమాచారమందించాడు.


ఒక అడుగు పొడవున్న ఈ పాము పిల్లను సౌతర్న్ బ్లాక్ రేసర్‌గా గుర్తించారు. దీన్ని హవాయి డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అధికారులకు అప్పగించారు. హవాయిలో పాముల రవాణా నిషేధం. హవాయి ద్వీపంలో వేటాడే మాంసాహారులుగా పరిగణించే ఈ పాములు వన్యప్రాణి, పర్యావరణానికి హానికలిగించే కారకాలుగా భావిస్తారు.

2357
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles