శ్రీలంక ప్రధాని అత్యవసర సమావేశం

Sun,April 21, 2019 02:10 PM

కొలంబో: బాంబు పేలుళ్ల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు శ్రీలంక ప్రధానమంత్రి రణీల్ విక్రమసింఘే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొలంబో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో సంభవించిన బాంబు పేలుళ్లలో చనిపోయిన మృతులకు శ్రీలంక ప్రభుత్వం తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది. గాయపడ్డవారిని ఇప్పటికే వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ప్రజలు శాంతియుతంగా ఉండాల్సిందిగా కోరుతున్నట్లు దేశాధ్యక్షుడు తెలిపారు. అధికారులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ తీవ్ర పరిస్థితుల్లో వదంతులను నమ్మొద్దని, ఐక్యత ప్రదర్శిస్తూ ప్రజలు శాంతియుతంగా ఉండాలని ప్రధాని రణీల్ విక్రమసింఘే కోరారు.1339
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles