క్రైస్ట్‌చ‌ర్చ్‌కు ప్ర‌తీకారం.. మృతుల సంఖ్య 321

Tue,April 23, 2019 02:45 PM

Srilanka blasts were retaliation to Christchurch attack: Ruwan Wijewardene

హైద‌రాబాద్: న్యూజిలాండ్‌లోని మ‌సీదుల్లో జ‌రిగిన మార‌ణ‌కాండ‌కు ప్ర‌తీక‌రంగా శ్రీలంక‌లో పేలుళ్లు జ‌రిగిన‌ట్లు ఆ దేశ ర‌క్ష‌ణ శాఖ మంత్రి రువాన్ విజ‌వ‌ర్ద‌నే తెలిపారు. ఇవాళ పార్ల‌మెంట్‌లో మాట్లాడుతూ ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. క్రైస్ట్‌చ‌ర్చ్ దాడుల‌కు ప్ర‌తీకారంగా ఇస్లామిక్ ఉగ్ర‌వాదులు లంకలో పేలుళ్ల‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంద‌న్నారు. ఆస్ట్రేలియాకు చెందిన శ్వేత‌జాతీయుడు క్రైస్ట్‌చ‌ర్చ్‌లో మ‌సీదులోకి వెళ్లి కాల్పుల‌కు తెగించిన విష‌యం తెలిసిందే. ఆ కాల్పుల్లో సుమారు 50 మందికిపైగా ముస్లింలు మ‌ర‌ణించారు. దేశ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లో లోపాలు ఉన్న‌ట్లు ఆయ‌న అంగీక‌రించారు. అన్ని ఉగ్ర సంస్థ‌ల‌ను రూపుమాపేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. ఆదివారం ఈస్ట‌ర్ పూట జ‌రిగిన వ‌రుస పేలుళ్ల‌లో మృతిచెందిన వారి సంఖ్య 321కి చేరుకున్న‌ది. 38 మంది విదేశీయులు మృతిచెందారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన వెబ్‌సైట్‌లోనూ ప్ర‌తీకార అంశం ఉన్న‌ట్లు విచార‌ణాధికారులు గుర్తించారు. పేలుళ్ల‌లో మృతిచెందిన వారికి సామూహిక ఖ‌న‌నం చేస్తున్నారు.

3598
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles