పేలుళ్ల ఎఫెక్ట్‌.. 1.5 బిలియన్‌ డాల‌ర్ల న‌ష్టం!

Fri,April 26, 2019 06:27 PM

కొలంబో: ఈస్టర్‌ పండుగ రోజున శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటన తమ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుందని శ్రీలంక ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ దేశంలో చాలా మందికి టూరిజం ఇండస్ట్రీనే ఉపాధి కల్పిస్తోంది. భయంకరమైన ఉగ్రదాడుల నేపథ్యంలో విదేశీ పర్యాటకులు ఈ దేశంలో పర్యటించేందుకు ఇకపై అంతగా ఆసక్తి చూపించకపోవచ్చు.


ఈ ఉగ్రదాడి వల్ల టూరిజంపై తీవ్రస్థాయిలో ప్రభావం పడుతుంది. తమ దేశానికి వచ్చే పర్యాటకుల సంఖ్యలో ఈ ఏడాది 30శాతం వరకు తగ్గుదల ఉంటుందని అంచనా వేస్తున్నాం. విదేశీ మారకంలో దీని విలువ సుమారు 1.5బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల వరకు ఉంటుందని ఆదేశ ఆర్థికశాఖ మంత్రి మంగళ సమరవీర విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఉగ్రవాదుల మారణకాండతో పర్యాటక రంగంపై తీవ్రస్థాయిలో ప్రతికూల ప్రభావం పడుతుందని పర్యాటక సంస్థలు, హోటళ్ల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. దాడుల వల్ల ఆదాయం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి సీజన్‌లో చాలామంది టూరిస్టులు శ్రీలంక పర్యటనకు మొగ్గు చూపుతుంటారు.

2601
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles