తన తోకను తానే మింగేసిన పాము.. వీడియో

Tue,August 13, 2019 12:05 PM

చిన్న చిన్న జలచరాలను పాములు తినడం చూశాం.. కానీ తన తోకను తానే మింగిన పామును చూశారా? మరి ఆ పామును చూడాలంటే అమెరికాలోని పెన్సిల్వేనియాకు వెళ్లాల్సిందే. అక్కడి సరీసృపాల అభయారణ్యంలో ఓ పాము తన తోకను తానే మింగుతున్న వైనాన్ని స్నేక్‌ ఎక్స్‌పర్ట్‌ అయిన జీస్సే రోథాకర్‌ చూశాడు. దీంతో ఆయన అప్రమత్తమై ఆ పాము నోట్లో నుంచి తోకను బయటకు తీసేందుకు సుమారు 5 నిమిషాల పాటు శ్రమించాడు. పాము తలపై నెమ్మదిగా నిమరడంతో.. అది కూడా నెమ్మదిగా తన నోట్లో నుంచి తోకను బయటకు తీసింది. అయితే ఈ జాతికి చెందిన పాములు ఇతర జాతులకు చెందిన పాములను మింగేస్తుంటాయని జీస్సే చెప్పుకొచ్చాడు. ఈ తోక వేరే పాముదై ఉండొచ్చని తనకు తానే తెలియకుండా.. తన తోకనే మింగేసిందని పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

2318
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles