పాక్ తాలిబ‌న్ చీఫ్‌.. అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాది

Thu,September 12, 2019 12:58 PM

Tehreek-e-Taliban Pakistan chief Noor Wali Mehsud designated as global terrorist by US

హైద‌రాబాద్‌: ఉగ్ర‌వాదాన్ని పోషిస్తున్న పాకిస్థాన్‌కు మ‌రో జ‌ల‌క్ ఇచ్చింది అమెరికా. నిషేధిత తెహ్రీక్ ఈ తాలిబ‌న్ పాకిస్థాన్‌(టీటీపీ) చీఫ్ నూర్ వాలీ మెహ‌సూద్‌ను అమెరికా అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించింది. ఆ సంస్థ‌కు ఆర్థిక స‌హాకారం అంద‌కుండా చేసేందుకు ఈ చ‌ర్య‌లు తీసుకున్నారు. సెప్టెంబ‌ర్ లెవ‌న్ దాడులు జ‌రిగి 18 ఏళ్లు కావ‌స్తున్న త‌రుణంలో అగ్ర‌రాజ్య‌సం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. గ‌త ఏడాది తెహ్రీక్ తాలిబ‌న్ పాక్ నేత ముల్లా ఫ‌జ్‌లుల్లాను హ‌త‌మార్చారు. ఆ త‌ర్వాత ఆ ఉగ్ర సంస్థ చీఫ్‌గా మెహ‌సూద్‌ను నియ‌మించారు. వాలీ నేతృత్వంలోనే పాక్‌లో అనేక చోట్ల ఉగ్ర‌దాడులు జ‌రిగిన‌ట్లు అమెరికా ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.

2159
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles