ఇది మైక్రోవేవ్ చాలెంజ్ టైమ్.. మీరు కూడా పాల్గొంటారా?

Thu,March 21, 2019 07:20 PM

The Microwave Challenge Is The Latest Bizarre Trend Taking Over Twitter

సోషల్ మీడియా పుణ్యమాని నెటిజన్లకు టైమ్ పాసే టైమ్ పాస్. చాలెంజ్‌ల పేరుతో నెటిజన్లు మస్తు టైమ్ పాస్ చేస్తుంటారు. అప్పట్లో ఐస్ బకెట్ చాలెంజ్, తర్వాత కికి చాలెంజ్, ట్రాష్ చాలెంజ్ ఇలా ఎన్నో చాలెంజ్‌లు నెటిజన్లను మురిపించాయి.. మైమరిపించాయి. తాజాగా మైక్రోవేవ్ చాలెంజ్ అట. మైక్రోవేవ్ చాలెంజ్‌లో పాల్గొని దానికి సంబంధించిన వీడియోను మైక్రోవేవ్‌చాలెంజ్ హాష్‌టాగ్‌తో సోషల్ మీడియాలో షేర్ చేయాలి.

అసలేంటీ మైక్రోవేవ్ చాలెంజ్


మైక్రోవేవ్ ఓవెన్ తెలుసు కదా మీకు. మైక్రోవేవ్ ఓవెన్‌ను ఏదైనా ఫుడ్‌ను వేడి చేసుకోవడానికి ఉపయోగిస్తాం. ఫుడ్‌ను ఓవెన్‌లో పెట్టినప్పటి నుంచి అది లోపల తిరుగుతుంటుంది. అలా తిరుగుతూ వేడెక్కుతుందన్నమాట. సేమ్ ఫుడ్ ఎలాగైతే మైక్రోవేవ్ ఓవెన్‌లో తిరుగుతుందో అలాగే మీరు కూడా తిరగాలి. అలా రౌండ్‌గా తిరుగుతూ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలి. అదే చాలెంజ్. ఆ చాలెంజ్ టిక్‌టాక్ అనే యాప్‌లో స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి అలా అలా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొంతమంది మైక్రోవేవ్ చాలెంజ్‌లో పాల్గొని వాటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాటిపై ఓ లుక్కేసుకోండి.1809
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles