దొంగకు ముచ్చెటమలు పట్టించిన మహిళ.. వీడియో

Thu,October 17, 2019 10:29 AM

దోపిడీ దొంగకు ఓ మహిళా ఉద్యోగి చుక్కలు చూపించింది. దొంత తెచ్చుకున్న తుపాకీతో అతనికి ముచ్చెటమలు పట్టించింది సదరు మహిళ. అమెరికాలోని పాడ్‌కా పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ హోటల్‌లోకి సోమవారం రాత్రి ఓ దొంగ మాస్కు ధరించి తుపాకీతో ప్రవేశించాడు. క్యాష్‌ కౌంటర్‌లోకి వెళ్లిన దొంగ నగదు తీసుకుంటుండగా.. మహిళా ఉద్యోగి వచ్చింది. బయటకు వెళ్తే తానే మొత్తం నగదు ఇస్తానని దొంగకు చెప్పడంతో అతను కౌంటర్‌ బయటకు వచ్చాడు. క్యాష్‌ అంతా టేబుల్‌పై పడేస్తున్న క్రమంలో కొంత నగదు కిందపడింది.


ఈ సమయంలో దొంగ తన తుపాకీని టేబుల్‌పై పెట్టి నగదును తీసుకుంటున్నాడు. ఇదే అదునుగా భావించిన ఆ ఉద్యోగిని తుపాకీని తన చేతుల్లోకి తీసుకుని దొంగపై గురి పెట్టింది. దొంగకు ఏం చేయాలో తోచక బయటకు పరుగు పెట్టాడు. మళ్లీ వచ్చి తుపాకీ ఇవ్వాలని అడగ్గా.. దొంగపై కాల్పులు జరిపేందుకు ఆమె ప్రయత్నించింది. మొత్తానికి దొంత తన తుపాకీని వదిలిపెట్టి పారిపోయాడు. దొంగకు ముచ్చెటమలు పట్టించిన మహిళా ఉద్యోగిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. అయితే దొంగ కోరీ ఫిలిఫ్స్‌ను పాడ్‌కా పోలీసులు మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

2307
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles