తొలిసారిగా హిజ్రాకు డ్రైవింగ్ లైసెన్స్ !

Tue,November 27, 2018 02:30 PM

ఇస్లామాబాద్: పాకిస్థాన్ దేశ చరిత్రలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్(హిజ్రా)కు ట్రాఫిక్ అధికారులు డ్రైవింగ్ లైసెన్స్‌ను అందజేశారు. ఇస్లామాబాద్ పోలీస్ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్‌లు ట్రాన్స్‌జెండర్ లైలా అలీకి లైసెన్స్ జారీ చేశారు. దశాబ్దకాలంగా ఆమె డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతోందని పోలీస్‌లు వివరించారు.


ఇస్లామాబాద్‌లో ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పోలీసుల వల్ల కలిగే ఇబ్బందులను కూడా ఆమె పోలీస్ ఉన్నతాధికారి దృష్టికి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమెకు ఇస్లామాబాద్ ట్రాఫిక్ పోలీస్ నుంచి లైసెన్స్ ఇప్పిస్తానని, సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం పాక్‌లో సుమారు 5లక్షల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నట్లు అంచనా.

1812
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles