ట్రయాంగిల్ డ్యాన్స్ .. సోషల్ మీడియాలో వైరల్.. మీరు కూడా ట్రై చేస్తారా?

Thu,March 14, 2019 05:03 PM

Triangle Dance is going viral on social media

ట్రయాంగిల్ డ్యాన్స్.. ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్న హాష్‌టాగ్ ఇది. ఇటీవలే కదా... ట్రాష్ చాలెంజ్ అంటూ ఓ హాష్‌టాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు ట్రయాంగిల్ డ్యాన్స్ చాలెంజ్ అట. ఈ చాలెంజ్ ముందు టిక్ టాక్ అనే మొబైల్ యాప్‌లో ప్రారంభమైందట. తర్వాత సోషల్ మీడియాకు కూడా వ్యాపించింది.

ట్రయాంగిల్ డ్యాన్స్ చేయాలంటే ముగ్గురు వ్యక్తులు ఉండాలి. ముందుగా ఆ ముగ్గురు వ్యక్తులు ట్రయాంగిల్ షేప్‌లో నిలబడి ఒకరి భుజాల మీద మరొకరు చేతులు వేసి ఎగరాలి. అరె.. అంతేనా? అని అనకండి. ఆ డ్యాన్స్ చేసేటప్పుడు తెలుస్తుంది దాని బాధేందో. ఎందుకంటే.. ముగ్గురిలో ఒకరు ప్రతి స్టెప్పుకు వారి మధ్యలోకి వెళ్లాలి. తర్వాత ఇంకొకరు.. ఇలా ముగ్గురు స్టెప్స్ వేస్తూ చేసే డ్యాన్సే ట్రయాంగిల్ డ్యాన్స్.

ఇక‌ నెటిజన్లు ఊరుకుంటారా? ట్రయాంగిల్ డ్యాన్స్ హాష్‌టాగ్‌తో తాము వేసిన డ్యాన్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ వీడియోకు వచ్చిన కామెంట్లు చదువుతూ తెగ సంబరపడిపోతున్నారు. ఇంతకీ.. ట్రయాంగిల్ డ్యాన్స్ ఎలా చేయాలో మీకు అర్థమయిందా లేదా? అయితే.. ఈ వీడియోలు చూడండి. మీకు ఫుల్లు క్లారిటీ వస్తుంది.. అప్పుడు మీరు కూడా ట్రై చేయొచ్చు.


1207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles