“టీఆర్ఎస్ ఆస్ట్రేలియా“ ఆధ్వర్యంలో భారత జవానులకు నివాళి

Sun,February 17, 2019 04:50 PM

trs australia wing pays tribute to Pulwama martyrs

కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో 4 సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఈ సారి కెసిఆర్ జన్మదినం వేడుకలను జరుపుకోలేదు. భారత జవానులకు సిడ్నీ, మెల్బోర్న్ , అడిలైడ్ , కాన్బెర్రా , బ్రిస్బేన్ ల లో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రపంచంలో ఉన్న ప్రతీ భారతీయుడు వీర మరణం పొందిన జవానుల ఆత్మ శాంతి కోసం ప్రార్థనలు చేయాలనీ టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.


టిఆర్ఎస్ పార్టీ గొప్పతనాన్ని, ఆస్ట్రేలియా నలుమూలాల మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పడానికి తమ టిఆర్ఎస్ ఆస్ట్రేలియా సభ్యులు విశేషంగా కృషి చేస్తున్నారనీ,తెలంగాణ పునర్ నిర్మాణం తమ వంతు సహాయ సహకారాలను అందించడానికి సర్వదా సిద్ధమని, ఆ దిశలోనే పలు కార్యక్రమాలకు ఇప్పటికే శ్రీకారం చుట్టామని తెలిపారు. బంగారు తెలంగాణను సాధించే దశలో సీఎం చేస్తున్న కృషిని , దేశానికి వెన్నెముకైన రైతును రాజునుచేయ తలపెట్టిన దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ‘కాళేశ్వరం’ ఒక అద్భుతమని, ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ బీళ్లన్ని, పాడి పంటలతో సస్యశ్యామలమయ్యే ఒక మహత్కార్యమన్నారు.

న్యూసౌత్వేల్స్ ఇంచార్జి ప్రవీణ్ పిన్నమ, వైస్ ప్రెసిడెంట్ రాజేష్ రాపోలు మాట్లాడుతూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేయడానికి నడుం బిగించిన సీఎం కేసీఆర్ ఉక్కు సంకల్పాన్ని, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ అభివృద్ధి పథకాల గొప్పదనాన్ని సామాజిక మాధ్యమాల ద్వార ప్రపంచవ్యాప్తంగా వున్న తెలంగాణ బిడ్డలకు చేరేవిధంగా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా కృషి చేస్తుందని పేర్కొన్నారు. నాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపి, నేడు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్తున్న సీఎం దీర్గాయుష్యుతో వర్ధిలాల్లని సభ్యులంతా కలిసి ‘లాంగ్ లీవ్ కేసీఆర్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

1014
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles