టీఆర్‌ఎస్ సౌతాఫ్రికా.. 16 డేస్ 16 ఎంపీ సీట్స్

Fri,March 22, 2019 05:56 PM

TRS South Africa starts lok sabha elections campaign through social media

కేప్ టౌన్: లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ శాఖ ప్రారంభించింది. టీఆర్‌ఎస్ దక్షిణాఫ్రికాశాఖ రాష్ట్రంలో జరగబోయే ఎంపీ ఎన్నికలకి సోషల్ మీడియా కాంపెయిన్ ద్వారా ప్రచారాన్ని ఉధృతం చేసింది. 16 డేస్ 16 ఎంపీ సీట్స్ అనే స్లోగన్ ద్వారా సోషల్ మీడియా కాంపెయిన్‌కి శ్రీకారం చుట్టినట్లు ఆ శాఖ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రతి లోక్‌సభ స్థానానికి ఆయా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ గత నాలుగు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజల్లోకి సోషల్ మీడియా ద్వారా వెళ్లేందుకు ప్రణాళికలని సిద్ధం చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయం అయినప్పటికీ మెజార్టీని పెంచే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సౌతాఫ్రికా అధ్యక్షులు గుర్రాల నాగరాజు తెలిపారు.

1409
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles