కారు బాంబు పేలుడు..ఇద్దరు మృతి

Wed,May 22, 2019 04:08 PM


మొగదిషు : సోమాలియా రాజధాని మొగదిషులో కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా..12 మందికి గాయాలయ్యాయి. అధ్యక్షభవనానికి వెళ్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడినట్లు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అల్ షబాబ్ ప్రకటించింది. దాల్జిక్రాకు సమీపంలోని చెక్‌పాయింట్ వద్ద ఈ పేలుల్లు జరిగాయి. అయితే ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. పేలుళ్లలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్సుల్లో ఆస్పత్రికి తరలించామని వైద్య విభాగం ఉన్నతాధికారి అబ్ధి ఖాదిర్ అబ్ధి రహమాన్ తెలిపారు.

1943
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles