అత్యంత ప్రమాదకర దేశం.. వెనిజులా

Sat,June 9, 2018 07:53 AM

Venezuela named as most dangerous country in the world

హైదరాబాద్: ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశంగా వెనిజులా నిలిచింది. వరుసగా రెండవ సారి ఆ దేశానికి ఈ ర్యాంక్ వచ్చింది. గ్యాలప్ సర్వే తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. భద్రతా అంశంలో ఆఫ్ఘనిస్తాన్, దక్షిణ సుడాన్ కన్నా దారుణంగా వెనిజులా పడిపోయింది. 2017లో దేశంలో దోమ్మీలు, దోపిడీలు విస్తృతంగా చోటుచేసుకున్నాయి. సర్వేలో పాల్గొన్న సుమారు 42 శాతం మంది తమ డబ్బులు కానీ ప్రాపర్టీ కానీ కోల్పోయినట్లు తెలిపారు. అంతేకాదు, 25 శాతం మంది వెనిజులా దేశస్థులపైన దాడులూ జరిగాయి. పౌరులపై దాడులు జరిగిన ర్యాంకింగ్‌లోనూ వెనిజులా ఫస్ట్ నిలిచింది. గ్యాలప్ కోసం మొత్తం 142 దేశాల్లో సర్వే నిర్వహించారు. అయితే రాత్రి పూట సురక్షితంగా ఇంటికి వెళ్లే పరిస్థితి వెనిజులాలో లేదని కూడా సర్వేలో స్పష్టమైంది. గ్లోబల్ లా అండ్ ఆర్డర్ పేరుతో సర్వే నిర్వహించారు. వెనిజులాలో ఇటీవల తీవ్ర సంక్షోభం నెలకొన్నది. రాజకీయంగానూ ఆదేశంలో అస్థిరత ఉన్నది. సామూహిక నిరసన ప్రదర్శనలు, ఆహారం, మందుల కొరత, దోమ్మీలు, దోపిడీల లాంటి సంఘటనలు అక్కడ ఎక్కువయ్యాయి.

5027
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles