ఉడుత, పాము పోరాటం.. గెలుపు ఎవరిది? వైరల్ ఫోటో

Fri,May 24, 2019 06:38 PM

ఉడుత, పాము పోరాడుకుంటే ఏది గెలుస్తుంది చెప్పండి. ఖచ్చితంగా పామే గెలుస్తుంది అంటారా? కానీ.. ఇక్కడ మాత్రం అంతా రివర్స్ అయింది. ఆ పోరాటంలో ఉడుతే గెలిచింది. పామును తన పళ్లతో ఉడుత కసక్కున కొరికేసింది. మీరు పైన చూస్తున్న ఫోటో అదే.. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


యూఎస్‌ఏ నేషనల్ పార్క్ సర్వీస్ ఆ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. గ్వాడలుపె మౌంటెన్స్ నేషనల్ పార్క్‌లో ఆ ఘటన చోటు చేసుకున్నది.

ఆ ఉడుత సాధారణ ఉడుత కాదు. దాన్ని రాక్ ఉడుత అని పిలుస్తారు. అంటే అవి ఎక్కువగా రాళ్లలో నివసిస్తాయి. అయితే.. ఇవి చెట్ల ఆకులు, పళ్లు, గింజలు మాత్రమే తింటాయని అందరు అనుకుంటారు కానీ.. అవి పక్షుల గుడ్లను, బల్లులను, పాములను కూడా తింటాయట.

5259
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles