పుతిన్‌ను క‌లిసిన కిమ్‌

Thu,April 25, 2019 03:21 PM

Vladimir Putin and Kim Jong un pledge stronger ties in Vladivostok

హైద‌రాబాద్‌: నార్త్‌కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్‌, ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ క‌లుసుకున్నారు. వ్లాదివోస్తాక్ న‌గ‌రంలో జ‌రిగిన భేటీలో ఇద్ద‌రూ కాసేపు ముచ్చ‌టించారు. ర‌ష్యా, ఉత్త‌ర కొరియా మ‌ధ్య బంధాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఇద్ద‌రూ చెప్పారు. అణు నిరాయుధీక‌ర‌ణ అంశాన్ని ఇద్ద‌రూ చ‌ర్చించారు. ఉత్త‌ర‌కొరియా, అమెరికా మ‌ధ్య ఉన్న ఉద్రిక్త వాతావ‌ర‌ణాన్ని త‌గ్గించేందుకు స‌హ‌క‌రించ‌నున్న‌ట్లు పుతిన్ చెప్పారు. గ‌త ఫిబ్ర‌వ‌రిలో కిమ్‌, ట్రంప్ మ‌ధ్య రెండ‌వ సారి చ‌ర్చ‌లు జ‌ర‌గ‌డం వ‌ల్ల పుతిన్‌తో భేటీ ఆల‌స్య‌మైంది. అన్ని అంశాల‌పై పుతిన్‌తో మాట్లాడిన‌ట్లు కిమ్ చెప్పారు.

1028
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles