100 మంది భారత జాలర్లు విడుదల చేసిన పాక్

Fri,April 12, 2019 11:49 AM

100 Indian fishermen released from Pakistan arrive in Vadodara

గుజరాత్ : పాకిస్థాన్ నుంచి ఏప్రిల్ 8న విడుదలైన 100 మంది భారత జాలర్లు గురువారం రాత్రి వడోదర చేరుకున్నారు. 17 నెలల క్రితం.. వడోదరకు చెందిన జాలర్లు.. చేపలు పడుతూ అంతర్జాతీయ సముద్ర సరిహద్దును దాటి వెళ్లారు. దీంతో 100 మంది జాలర్లను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. అనంతరం కరాచీ జైలులో వారిని నిర్భంధించారు. ఏడాదిన్నర కాలం తర్వాత జాలర్లను జైలు నుంచి విడుదల చేసి ఈ నెల 8న అట్టారీ - వాఘా సరిహద్దు వద్ద భారత సైన్యానికి అప్పగించారు. అక్కడ్నుంచి అమృత్‌సర్ మీదుగా వడోదరకు రైలులో జాలర్లను తరలించారు. ఇటీవల రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా.. తమను ఒక గదిలో బంధించారని, వేరే చోటకు వెళ్లేందుకు అనుమతించలేదని ఓ జాలరి పేర్కొన్నాడు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలనే ఉద్దేశంతో.. 360 మంది భారత ఖైదీలను విడుదల చేస్తామని ఏప్రిల్ 5వ తేదీన పాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

1263
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles