బాలుడిని హత్యచేసి ఆపై..

Sat,January 21, 2017 07:36 AM

లుధియానా: పంజాబ్‌లోని లుధియానాలో దారుణ అమానుష సంఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలుడు.. 9 ఏళ్ల బాలుడిని చంపి రక్తం తాగడంతో పాటు శరీర మాంసాన్ని తిన్నాడు. అనంతరం శరీరం నుంచి తలను వేరుచేసి మృతదేహాన్ని ఆరు భాగాలుగా చేసి చెత్తకుప్పలో పడేశాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.


దీపూ కుమార్(9) అనే బాలుడు గడిచిన సోమవారం నాడు అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు దుర్గి అనే ప్రాంతంలోని ఖాళీ ప్రదేశంలో తలలేని మొండాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ద్వారా విచారణ చేపట్టగా భయంకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎనిమిదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.

బాలుడిని తానే హత్య చేసినట్లుగా ఒప్పుకుంటూ నిందితుడు జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. నరమాంసం తినే కేసుగా పోలీసులు పేర్కొంటున్నారు. పచ్చి చికెన్ తినడం, అప్పుడప్పుడు తన శరీర అవయవాలనే తినడం వంటి చర్యలకు నిందితుడు పాల్పడేవాడని విచారణలో వెల్లడైందని డీసీపీ భూపిందర్‌సింగ్ తెలిపారు. నిందితుడిని వైద్య పరీక్షలకు, మానసిక చికిత్స పరీక్షకు పంపినట్లుగా పేర్కొన్నారు.


సోమవారం నాడు మధ్యాహ్నం 1.40 సమయంలో గాలిపటాలు ఇస్తానని చెప్పి నిందితుడు ఇంటి నుంచి దీపూను తీసుకెళ్లాడు. ఆ సమయంలో బాలుడి తల్లిదండ్రులు పనిలో నిమగ్నమై ఉన్నారు. బాలుడిని మొదటగా గొంతు నులిమి చంపాడు. అనంతరం తోట పనులకు వినియోగించే పదునైన కత్తితో శరీరాన్ని ముక్కలుగా చేశాడు. పాలీకవర్లో మృతదేహాన్ని ఉంచి తన సైకిల్‌పై వెళ్లి దుర్గీ ప్రాంతంలో పడేశాడు. శరీరం నుంచి గుండెను వేరుచేసి తను చదువుకునే పాఠశాల ఆవరణలోకి విసిరాడు. ఉపాధ్యాయులంటే తనకు అసహ్యమని ఆ స్కూల్‌కు చెడ్డపేరు రావాలనే అలా చేసినట్లు చెప్పాడు. స్కూల్ ఆవరణలోని నీళ్ల ట్యాంక్ వద్ద పోలీసులు గుండెను కనుగొన్నారు.

3047
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles