భార‌త్ లో విస్త‌రిస్తున్న బ్లూ వేల్ భూతం!

Fri,August 11, 2017 05:28 PM

2 boys rescued from blue whale challenge game by police

ర‌ష్యాలో ప్రారంభ‌మైన బ్లూ వేల్ భూతం ఇప్పుడు బార‌త్ కు విస్త‌రించింది. ర‌ష్యా దేశంలో ఇప్ప‌టికే 100 పైగా పిల్ల‌ల ప్రాణాల‌ను తీసుకున్న బ్లూ వేల్ చాలెంజ్ ఇప్పుడు భార‌త్ లోనూ పిల్ల‌ల ప్రాణాల‌తో చెల‌గాటాలాడుతున్న‌ది. కొన్ని రోజుల క్రితం ముంబై కి చెందిన తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దివే పిల్లాడు బ్లూ వేల్ చాలెంజ్ లో గెల‌వ‌డం కోసం బిల్డింగ్ నుంచి దూకి చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌హారాష్ట్ర‌లోని సోలాపూర్ కు చెందిన 14 ఏళ్ల మ‌రో బాలుడు బ్లూ వేల్ చాలెంజ్ లో గెల‌వ‌డం కోసం ఇంట్లో నుంచి పారిపోయాడు. సోలాపూర్ నుంచి పూణె కు బ‌స్సు లో వెళ్తుండ‌గా పోలీసులు బాలుడిని ప‌ట్టుకొని త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించారు. అత‌డి ప్రెండ్స్ ను క‌నుక్కోగా బ్లూ వేల్ చాలెంజ్ లో ఉన్న 50 టాస్కులు ఆ బాలుడు పూర్తి చేశాడ‌ని.. ఇక లాస్ట్ టాస్క్ సూసైడ్ ను పూర్తి చేయ‌డం కోస‌మే పూణె వెళ్తున్న‌ట్లు వివ‌రించారు. దీంతో ఖంగు తిన‌డం పోలీసులు, బాలుడి త‌ల్లిదండ్రుల వంత‌యింది. బ్లూ వేల్ చాలెంజ్ గేమ్ ను త‌న తండ్రి మొబైల్ నుంచే ఇన్ని రోజులు ఆ బాలుడు ఆడ‌టం.. ఈ విషయాన్ని క‌నీసం బాలుడి త‌ల్లిదండ్రులు కూడా గ‌మ‌నించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు బాలుడిని బ్లూ వేల్ గేమ్ నుంచి బ‌య‌టికి తీసుకురాగ‌లిగారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఇండోర్ కు చెందిన 13 ఏళ్ల బాలుడు కూడా బ్లూ వేల్ చాలెంజ్ లో భాగంగా సూసైడ్ చేసుకోవ‌డానికి స్కూల్ బిల్డింగ్ మూడో ఫ్లోర్ లోని కిటికీ నుంచి దూక‌బోయాడు. గ‌మ‌నించిన తోటి విద్యార్థులు బాలుడిని ర‌క్షించ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఇంత‌లో స్కూల్ ఫిజిక‌ల్ ట్రైన‌ర్ అక్క‌డికి వ‌చ్చి పిల్లాడిని ర‌క్షించి.. ఆరా తీయ‌గా బ్లూ వేల్ చాలెంజ్ గేమ్ గురించి వివ‌రించాడు పిల్లాడు.

బ్లూ వేల్ చాలెంజ్ గేమ్ అంటే?
బ్లూ వేల్ చాలెంజ్ గేమ్ గురించి ఇదివ‌ర‌కే మ‌నం మాట్లాడుకున్నాం. ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయాల‌నుకునే వాళ్లు ముందుగా ఆ గేమ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని గేమ్ నిర్వాహ‌కులు చెప్పిన టాస్కుల‌ను పూర్తి చేయాలి. ముందుగా తిమింగ‌లం బొమ్మ‌ను చ‌ర్మంపై పొడుచుకోవాలి. రాత్రులు నిద్ర లేవాలి. ఇలా.... 50 రోజులు రోజుకో టాస్క్ చేసి వాటి వీడియోలు తీసి యాప్ లో అప్ లోడ్ చేయాలి. ఇక‌.. చివ‌ర‌గా గేమ్ గెల‌వ‌డానికి సూసైడ్ చేసుకొని చ‌నిపోవాలి. అప్పుడు మాత్ర‌మే గేమ్ లో గెలిచిన‌ట్లు. ఈ డేంజ‌ర్ గేమ్ మాయ‌లో ప‌డి ఇప్ప‌టికే రష్యాలో 100 మంది పిల్ల‌లు సూసైడ్ చేసుకొని చ‌నిపోగా... ఇండియాలోని ముంబై లో ఓ బాలుడు చనిపోయాడు. మ‌రో ఇద్ద‌రు పిల్ల‌లు సూసైడ్ చేసుకోబోతుండ‌గా పోలీసులు కాపాడారు.

7791
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles