నంద్యాలలో బాంబు పేలుడు : ఇద్దరు మృతి

Tue,July 31, 2018 01:01 PM

కర్నూల్ : నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో ఇవాళ ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులను స్థిరాస్తి వ్యాపారులు రాజశేఖర్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డిగా పోలీసులు గుర్తించారు. అయితే వీరు తమ స్థలంలో బండరాయి తొలగిస్తుండగా.. బాంబు పేలినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

847
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles