ఆ మేక ధర రూ. 8 లక్షలు.. మరి ఎన్ని కేజీలో తెలుసా?

Thu,August 8, 2019 12:19 PM

211 kg goat priced at whopping Rs 8 lakh ahead of Eid ul Adha

హైదరాబాద్‌ : మేక ధర రూ. 8 లక్షలు ఉంటుందా? అని ముక్కున వేలేసుకోకండి.. అది నిజమే. మరి ఆ మేక ఎన్ని కేజీలు ఉందో తెలుస్తే షాక్‌ అవ్వాల్సిందే.. ఏకంగా 211 కేజీల బరువుంది. మంచి పోషకాహారంతో పెంచిన ఆ మేకకు బక్రీద్‌ పర్వదినం వేళ మంచి డిమాండ్‌ ఉంది. ఉత్తరప్రదేశ్‌ హమీర్‌పూర్‌కు చెందిన అబ్‌రార్‌ ఖాన్‌ అనే వ్యక్తి ఓ మేకను గత కొంతకాలం నుంచి పెంచుకుంటున్నాడు. 211 కేజీల బరువున్న ఈ మేకను రూ. 8 లక్షలకు బేరం పెట్టాడు. ఈ సందర్భంగా మేక యజమాని అబ్‌రార్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ఈ మేకను పెంచేందుకు భారీగా ఖర్చు పెట్టానని తెలిపాడు. బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌లో ప్రతి రోజు ఆహారంగా పెట్టానని పేర్కొన్నాడు. ప్రతి రోజు ఒక గంట పాటు మేకకు మసాజ్‌ చేశానని చెప్పుకొచ్చాడు. బలంగా ఉన్న తన మేకను కొనేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. రూ. 6 లక్షలకు మేకను కొంటామని ఇప్పటికే పలువురు తనను కలిశారని చెప్పాడు. 211 కేజీల బరువున్న తన మేకను రూ. 8 లక్షలకు అమ్మేందుకు సిద్ధమైనట్లు అబ్‌రార్‌ ఖాన్‌ స్పష్టం చేశాడు.

4798
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles