48 గంటల్లో 36 మంది చిన్నారులు మృతి

Wed,June 12, 2019 09:52 AM

36 children have died in Bihar of suspected AES


ముజఫర్ పూర్ : బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో విషాదం నెలకొంది. మెదడువాపు వ్యాధి సంబంధిత లక్షణాలతో 48 గంటల వ్యవధిలో 36 మంది పిల్లలు మృతి చెందారు. విపరీత జ్వరం, ఇతర లక్షణాలతో మరో 100 మందికిపైగా చిన్నారులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన చిన్నారుల్లో ఎక్కువ మంది తీవ్రజ్వరం, హైపోగ్లైసీమియా (రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోవడం) లక్షణాలున్నవారేనని ముజఫర్ నగర్ సివిల్ సర్జన్ ఎస్పీ సింగ్ తెలిపారు. చిన్నారుల్లో కొంతమంది కేజ్రీవాల్ ఆస్పత్రిలో, మరికొందరు శ్రీ కృష్ణ మెమోరియల్ కాలేజ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.


3058
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles