నలుగురు గ్యాంగ్‌స్టర్లు అరెస్ట్‌

Thu,August 22, 2019 04:47 PM

4 gangsters arrested in rival murder case


చెన్నై: ఓ ముఠా సభ్యుడిని హత్య చేసిన ఘటనలో తమిళనాడు పోలీసులు నలుగురు గ్యాంగ్‌స్టర్లను అరెస్ట్‌ చేశారు. కే.పుడుర్‌ ఏరియాలో నలుగురు గ్యాంగ్‌స్టర్లను అరెస్ట్‌ చేశారు. గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న రాజా అనే వ్యక్తి ఇటీవలే బైకుపై వస్తుండగా ఎనిమిది మంది అతన్ని చుట్టుముట్టి రాళ్లతో కొట్టారు..ఆ తర్వాత కత్తులతో దాడి చేశారు. తీవ్రగాయాలతో ఉన్న రాజా అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ కొంతదూరం వచ్చి కిందపడిపోయి ప్రాణాలు విడిచాడని పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సీసీ టీవీ పుటేజీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా రాజా హత్యకు పాల్పడిన గ్యాంగ్‌స్టర్లు నిజాముద్దీన్‌, కార్తీక్‌, థౌబీక్‌, హరికృష్ణన్‌ ను అదుపులోకి తీసుకున్నాం. మిగిలిన నలుగురి కోసం గాలింపు కొనసాగిస్తున్నామన్నారు. మృతుడు రాజా తన ప్రత్యర్థి గ్యాంగ్‌ సభ్యుడి హత్యకేసులో నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు.

1482
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles