వంద లంచం కేసు.. చనిపోయిన నాలుగేళ్లకు నిర్దోషిగా తీర్పు

Tue,March 5, 2019 05:10 PM

4 years after death, Doctor declared innocent in 100 rupees bribery case

న్యాయం చేయడం ఆలస్యమైతే అన్యాయం చేయడమే అవుతుందని ఇంగ్లిష్‌లో ఓ నానుడి ఉంది. లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ డాక్టరు నిర్దోషి అని బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. కాకపోతే చాలా ఆలస్యంగా ఆయనకు న్యాయం లభించింది. కేసు దాఖలైన 32 సంవత్సరాలకు కోర్టులో ఆయన నిర్దోషిత్వం రుజువైంది. కానీ ఆ తీర్పు వినేందుకు సదరు డాక్టరు సజీవుడై లేరు. ఆయన మరణించి నాలుగేళ్లు అవుతున్నది. ఇంతకూ కేసులో సూచించిన లంచం ఎంత? అంటే కేవలం వంద రూపాయలు. నిశికాంత్ కులకర్ణి అనే ఆ వైద్యుడు మహారాష్ట్రలోని మన్మాడ్ మునిసిపాలిటీ హాస్పిటల్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. వందరూపాయలు లంచం తీసుకుని ఆయన డెత్ సర్టిఫికెట్ ఇచ్చారని 1987 సెప్టెంబర్‌లో కేసు నమోదైంది. తన సోదరుని డెత్ సర్టిఫికెట్ కోసం నిశికాంత్ 150 రూపాయల లంచం అడిగారని, చివరకు 100 రూపాయలకు బేరం కుదిరిందని ఓ వ్యక్తి ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుపై సెషన్స్ కోర్టు 2005లో తీర్పు చెప్పింది. డాక్టరుకు, ఆయన ప్యూనుకు ఏడాది, ఆరునెలల చొప్పున శిక్షలు పడ్డాయి. లంచం సొమ్ము నేరుగా తీసుకున్నది ప్యూనే. దీనిపై నిందితులు హైకోర్టుకు వెళ్లారు. కేసు నడుస్తుండగానే డాక్టరు వృద్ధాప్యం వల్ల చనిపోయారు. కానీ ఆయన కుటుంబ సభ్యులు నిర్దోశిత్వం రుజువు చేయాల్సిందేననే పట్టుదలతో హైకోర్టులో కేసు కొనసాగించారు. అంతమంగా విజయం సాధించారు. కానీ ఆ విజయం చూసుకునే భాగ్యం పాపం ఆ డాక్టరుకు దక్కలేదు.

3166
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles