మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా

Thu,March 14, 2019 10:23 PM

5 lacks to kin who died in mumbai Bridge Incident


ముంబై : ముంబైలోని సీఎస్ ఎంటీ రైల్వేస్టేషన్ కు సమీపంలో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలడం దురదృష్టకరమని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. సీఎం ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడుతూ..ఇటీవలే బ్రిడ్జి పనితీరుపై నిర్మాణాత్మక తనిఖీలు చేశాం. అయితే బ్రిడ్జి దృఢంగానే ఉన్నట్లు తేలింది. తనిఖీలు పూర్తయిన తర్వాత ఇలాంటి ఘటన జరిగింది. ఈ ఘటనతో పలు రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బ్రిడ్జి తనిఖీలకు సంబంధించి విచారణ చేపడ్తాం. ఎవైనా అవకతవకలున్నట్లు నిర్దారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించామని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50 చొప్పున నష్టపరిహారం అందజేస్తామని సీఎం ఫడ్నవిస్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా..36 మందికి పైగా గాయాలయ్యాయి.

2734
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles