ధోనీ, కోహ్లి మీకో చాలెంజ్.. మీ లగ్జరీ కారులో చెత్త తీసుకెళ్తారా?

Tue,June 12, 2018 03:33 PM

భోపాల్: రోడ్డుపై 35 లక్షల విలువైన ఓ లగ్జరీ కారు వెళ్తున్నది. దాని వెనుక ఓ ట్రాలీని కట్టారు. ఆ ట్రాలీలో తీసుకెళ్తున్నది ఏంటో తెలుసా.. రోడ్లపై ఉండే చెత్త. నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన అభినిత్ గుప్తా అనే డాక్టర్ ఈ పని చేశాడు. తాను చేయడమే కాదు.. సెలబ్రిటీలకు మీరిలా చేయగలరా అంటూ సవాలు కూడా విసురుతున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో స్వచ్ఛభారత్ అభియాన్ కూడా ఒకటి. ఈ స్వచ్ఛతలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ముందు వరుసలో ఉన్నట్లు కూడా తేలింది.


నగరం క్లీన్‌గా ఉండాలంటే.. అందులో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యం. దీనిపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ డాక్టర్ ఇలా తన 35 లక్షల విలువైన డీసీ అవంతి కారుకు ఇలా చెత్త ట్రాలీని అటాచ్ చేసి తీసుకెళ్తున్నాడు. ఈ కారును ఆయన తండ్రి అభినిత్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆయన కూడా ఇప్పుడు తన తనయుడు చేస్తున్న పనిని మెచ్చుకుంటున్నారు. తాను చేయడమే కాకుండా క్రికెటర్లు ధోనీ, కోహ్లి, బాలీవుడ్ నటులు రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్, సల్మాన్‌ఖాన్‌లాంటి వాళ్లకు ఈ చాలెంజ్ విసిరాడు. దీన్నో సవాలుగా తీసుకుందాం. లగ్జరీ కార్లున్న ప్రతి ఒక్కరూ ఈ చాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లండి అంటూ ఆ సెలబ్రిటీలందరినీ ట్యాగ్ చేశాడు.

3186
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles