కేంద్రమంత్రిపై ఇంకు చల్లిన యువకుడు.. వీడియో

Tue,October 15, 2019 12:29 PM

పాట్నా : కేంద్ర సహాయ మంత్రి ఆశ్విని చౌబేపై గుర్తు తెలియని ఓ యువకుడు ఇంకు చల్లాడు. ఈ ఘటన పాట్నా మెడికల్‌ కాలేజీ ఆస్పత్రి వద్ద ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఆశ్విని చౌబే.. డెంగీ రోగులను పరామర్శించేందుకు, వారి ఆరోగ్య వివరాలను తెలుసుకునేందుకు పాట్నా మెడికల్‌ కాలేజీకి వెళ్లారు. రోగులను పరామర్శించిన అనంతరం కేంద్ర మంత్రి తిరిగి వెళ్తున్న క్రమంలో ఆయనపై ఓ యువకుడు ఇంకు చల్లి పారిపోయాడు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఈ ఇంకు దాడి ప్రజలు, ప్రజాస్వామ్యంపైన దాడి చేయడమే అని పేర్కొన్నారు.



749
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles