కుర్చీలు విసురుతూ బీఎస్పీ కార్యకర్తల వీరంగం..వీడియో

Tue,June 18, 2019 07:07 PM

A Ruckus broke during a review meeting of BSP in Amravati


మహారాష్ట్ర: మహారాష్ట్రలో బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. అమ్రావతిలో జూన్ 17న బీఎస్పీ నేతలు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. అయితే సమావేశం మొదలు కాకముందే కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు.

కార్యకర్తలు స్టేజీపై ఉన్న నేతలపై మండిపడుతూ..వారిపై కుర్చీలు విసిరారు. దీంతో స్టేజీపై ఉన్నవారు పరుగులు పెడుతుండగా..ఓ వ్యక్తి చొక్కా కూడా చించేందుకు ప్రయత్నించారు. బీఎస్పీ కార్యకర్తలు ఎందుకింత ఆగ్రహానికి గురయ్యారనే విషయం తెలియాల్సి ఉంది. బీఎస్పీ కార్యకర్తలు సొంతపార్టీ నేతలపై దాడికి పాల్పడిన వీడియో వైరల్ అవుతోంది.



1563
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles