వరద ఉధృతికి కుప్పకూలిన స్కూల్ బిల్డింగ్.. వీడియో

Mon,September 16, 2019 09:39 PM

పాట్నా : బీహార్‌ను వర్షాలు ముంచెత్తాయి. ఖాతీహార్‌లోని గంగా నదిలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. నది ఒడ్డుకు అనుకుని ఉన్న ఓ పాఠశాల భవనం క్షణాల్లో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పాఠశాలలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వరదల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా విద్యాశాఖ అధికారులు.. తరగతులను రద్దు చేసి.. విద్యార్థులను వేరే పాఠశాలకు తరలించారు. అయితే పాఠశాల భవనం కుప్పకూలుతున్న దృశ్యాలను కొందరు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.



1261
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles