చిదంబరం నివాసానికి సీబీఐ అధికారుల బృందం

Tue,August 20, 2019 08:00 PM

 A team of CBI officers arrives at P Chidambaram residence in delhi


న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నివాసానికి సీబీఐ అధికారులు వెళ్లారు. ఈ కేసులో చిదంబరానికి ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరుగురు సీబీఐ అధికారుల బృందం ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే చిదంబరం ఇంట్లో లేకపోవడంతో సీబీఐ టీం వెనుదిరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు సీబీఐ అధికారులు వెళ్లడంతో చిదంబరాన్ని అరెస్ట్ చేస్తారంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో సీబీఐ చిందబరాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించింది.


744
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles