స్కూల్‌ బస్సుపై విరిగిపడ్డ చెట్టు.. తప్పిన ప్రమాదం

Wed,August 14, 2019 10:25 AM

బెంగళూరు : రహదారిపై వెళ్తున్న ఓ ప్రయివేటు పాఠశాల బస్సుపై భారీ వృక్షం విరిగిపడింది. ఈ సంఘటన కర్ణాటక మంగళూరులోని నాన్తూర్‌లో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు పెద్దగా గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 17 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సులో నుంచి విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. బస్సుపై విరిగిపడ్డ వృక్షాన్ని పోలీసులు తొలగిస్తున్నారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ సంభవించింది.1353
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles