వికటించిన రక్త మార్పిడి.. బాలింత మృతి

Mon,July 22, 2019 12:19 PM

a woman dies after Distorted blood transfusion in Anantapur dist Hospital

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి ఓ బాలింత మృతి చెందింది. సుకన్య అనే గర్భిణి ఈ నెల 17వ తేదీన ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చింది. దీంతో వైద్యులు ఆమెకు సిజేరియన్‌ చేసి బిడ్డను బయటకు తీశారు. ఆ తర్వాత తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. అయితే బాలింతకు రక్తం తక్కువగా ఉంది. రక్తం ఎక్కించాలని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పి.. ‘ఓ’ నెగిటివ్‌ బ్లడ్‌కు బదులు ‘ఓ’ పాజిటివ్‌ బ్లడ్‌ ఎక్కించారు.. ఆ రక్తం వికటించి బాలింత సుకన్య మృతి చెందింది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు.. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 20 రోజుల క్రితం ఇదే ఆస్పత్రిలో ఓ బాలింతకు వేరే గ్రూప్‌ రక్తం ఎక్కించడంతో ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది. ఆ సమయంలో జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకుని.. బాలింత మృతికి కారణమైన ఐదుగురిని సస్పెండ్‌ చేశారు.

841
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles