ఆలస్యం లేకుండా ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌కార్డు

Fri,July 5, 2019 01:01 PM

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో నేడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. సామాన్యుల నుంచి కార్పోరేట్ వర్గాల వరకు మోదీ ప్రభుత్వ బడ్జెట్‌పై ఎన్నో ఆశలు, నమ్మకాలు పెట్టుకున్నారు. తిరిగి మళ్లీ అధికారంలోకి వచ్చిన ఎన్డీయేకు ఇదో పరీక్ష. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు, సంక్షేమ పథకాల కొనసాగింపు, సంస్కరణలు ప్రభుత్వానికి సవాల్‌గా ఉన్నాయి. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ.. ప్రధాని మోదీ మొదటి ఐదేళ్ల పాలనలో(2014-19) కేంద్ర-రాష్ట్ర సంబంధాల పునరుద్ధరణ, కో ఆపరేటీవ్ ఫెడరలిజం, జీఎస్‌టీ కౌన్సిల్, ఆర్థిక క్రమశిక్షణ వంటి ఎన్నో సంస్కరణలకు తెరతీశారన్నారు. ఈ దఫా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రాధాన్యత క్రమంగా రానున్న ఏడాదికి ప్రభుత్వం ఏ విధంగా నిధులను ఖర్చు చేయనుందో బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ వివరించారు. అదేవిధంగా ఇండియన్ పాస్‌పోర్టు కలిగిఉన్న ఎన్‌ఆర్‌ఐలకు ఎటువంటి ఆలస్యం లేకుండా ఆధార్‌కార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. గతంలో ఉన్న 180 రోజుల నిరీక్షణకు ముగింపు పలికారు.1574
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles