రోడ్లు మంచిగా ఉండడం వల్లే ప్రమాదాలు..

Thu,September 12, 2019 12:35 PM

Accidents Due To Good Roads says Karnataka Deputy Chief Minister

బెంగళూరు : కర్ణాటకకు చెందిన డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దెబ్బతిన్న రోడ్ల వల్ల రోడ్డు ప్రమాదాలు జరగడం లేదు. మంచి రోడ్ల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. ట్రాఫిక్ చలాన్లు తగ్గించే అంశంపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోవింద్ కర్జోల్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది సుమారు 10 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రమాదాలు రోడ్లు బాగాలేక జరుగుతున్నాయని మీడియా కథనాలు ప్రసారం చేస్తుంది.

కానీ మంచి రోడ్ల వల్లే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తాను నమ్ముతున్నానని ఆయన చెప్పారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా హైవేలపై జరుగుతున్నాయన్నారు. హైవేలపై గంటకు 120 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో వాహనాలను నడుపుతున్నారని.. ఈ క్రమంలోనే వాహనాలు అదుపుతప్పుతున్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు. ట్రాఫిక్ చలాన్ల తగ్గింపుపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని గోవింద్ కర్జోల్ స్పష్టం చేశారు.860
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles