మేఘాలయా ప్రజలకు భారీ ఊరట

Mon,April 23, 2018 04:46 PM


మేఘాలయా: ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో వివాదాస్పద ఆర్మడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్(ఏఎఫ్‌ఎస్‌పీఏ) చట్టాన్ని పూర్తిగా ఎత్తివేశారు. ఈ మేరకు ఇవాళ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టాన్ని కూడా సడలీకరించారు. 2017 సెప్టెంబర్ వరకు మేఘాలయాలో 40 శాతం వరకు ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టం అమలులో ఉండేది. అయితే ఇటీవల ఆ రాష్ట్రంతో జరిపిన సంప్రదింపుల తర్వాత దాన్ని ఎత్తివేస్తున్నట్లు హోంశాఖ వెల్లడించింది. అరుణాచల్‌లోని కేవలం 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏఎఫ్‌ఎస్‌పీఏ అమలులో ఉంటుంది. లొంగిపోయిన మిలిటెంట్లకు 4 లక్షలు ఇచ్చేందుకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు.

1671
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles