పర్స్ కొట్టేసిన ఎయిర్ ఇండియా రీజనల్ డైరెక్టర్

Mon,June 24, 2019 10:46 AM

Air India Regional Director theft purse

న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్టులోని ఓ దుకాణంలో చోరీకి పాల్పడిన ఎయిర్ ఇండియా రీజనల్ డైరెక్టర్ (తూర్పు), కెప్టెన్ రోహిత్ బాసిన్‌ను ఆ సంస్థ సస్పెండ్ చేసింది. ఈ సంస్థకు చెందిన విమానం శనివారం ఆస్ట్రేలియాలోని సిడ్నీ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ప్రయాణించాలి. అయితే ఈ విమానం బయలుదేరడానికి ముందు విమానాశ్రయంలోని ఓ దుకాణంలో బాసిన్ పర్స్(వ్యాలెట్)ను దొంగిలించాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఎయిర్ ఇండియా సంస్థ వెంటనే అతడిని విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన రీజనల్ మేనేజర్ ఇచ్చిన సమాచారం మేరకు బాసిన్‌పై చర్యలు తీసుకున్నామని తెలిపింది. వెంటనే గుర్తింపుకార్డును సెక్యూరిటీ సిబ్బందికి అందజేయాలని, అనుమతి లేకుండా ఎయిర్ ఇండియా సంస్థ పరిసరాల్లోకి ప్రవేశించరాదని ఆదేశించింది. బాసిన్ బాధ్యతలను మరో రీజనల్ డైరెక్టర్ అయిన సంజయ్ మిశ్రాకు అప్పగించినట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది.

778
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles