అమేథి బీజేపీ కార్యకర్త కాల్చివేత

Sun,May 26, 2019 10:34 AM

Amethi BJP Worker Who Campaigned For Smriti Irani Shot Dead

లక్నో: గ్రామ మాజీ సర్పంచ్‌, బీజేపీ క్రీయాశీల కార్యకర్త హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి లోక్‌సభ నియోజకవర్గంలోని బరౌలియా గ్రామంలో గడిచిన రాత్రి చోటుచేసుకుంది. సురేంద్ర సింగ్‌ అనే బీజేపీ కార్యకర్తపై కొందరు దుండగులు ఈ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. పాత గొడవలు గానీ, రాజకీయ తగాదాలు గానీ హత్యకు కారణమై ఉండొచ్చని అమేథి ఎస్పీ రాజేశ్‌ కుమార్‌ తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా స్మృతి ఇరానీ ఇతడి సేవలు మెచ్చుకుంటూ పలుమార్లు బహిరంగ సభల్లో ప్రస్తావించారు.

2624
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles